కాంగ్రెస్ సన్నాహక సమావేశం రసాభాస
హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.
- వీహెచ్ ప్రసంగాన్ని అడ్డుకున్న రేణుకాచౌదరి వర్గీయులు
- మనస్తాపంతో మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేసిన వీహెచ్
ఖమ్మం, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి ఏఐసీసీ నుంచి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఆరీఫ్ నసీమ్ ఖాన్ ఎదుటే కార్యకర్తలు సభా వేదికపై నాయకులతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతుండగా పలువురు కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ‘ఇక్కడ మీకేం పని.. ఇక్కడి నుంచి పోటీ చేస్తారా’ అని ప్రశ్నించారు.
తాను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీ స్థాయికి ఎదిగానని, పార్టీలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తినంటూ వీహెచ్ వారికి నచ్చజెప్పారు. అయినా.. వినకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభా వేదికపై గందరగోళం నెలకొనడంతో మల్లు భట్టివిక్రమార్క తనకు జూమ్ మీటింగ్ ఉందంటూ మరో గదిలోకి వెళ్లిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని, పదవుల కోసం తర్వాత ‘కొట్టుకుందాం.. పంచుకుందాం’ అంటూ వ్యాఖ్యానించారు. స్పందించిన రేణుకా చౌదరి.. పనిచేసిన కార్యకర్తలకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడు ఆరీఫ్ నసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

