కాంగ్రెస్ మహాగర్జన వేదిక ఢిల్లీకి మార్పు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి వ్యతిరేకంగా నవంబర్ ఒకటిన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగర్జన బహిరంగసభ వేదికను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌కు మార్చారు. ముందుగా ఈ జాతీ య స్థాయి నిరసన ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ అనూహ్యంగా వేదికను ఢిల్లీకి మార్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- ఒకటిన రామ్‌లీలా మైదాన్‌లో బహిరంగసభ నిర్వహణ
- స్థానిక నేతల భయాందోళనే వేదిక మార్పునకు కారణం
- ప్రభుత్వ వ్యతిరేకత జనసమీకరణపై పడుతుందని సందేహం
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి వ్యతిరేకంగా నవంబర్ ఒకటిన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగర్జన బహిరంగసభ వేదికను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌కు మార్చారు. ముందుగా ఈ జాతీ య స్థాయి నిరసన ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ అనూహ్యంగా వేదికను ఢిల్లీకి మార్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఈ సభను నిర్వహించకుండా చివరి నిమిషంలో వెనకి తగ్గడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జాతీయస్థాయి సభకు అనుకున్న స్థాయిలో జనసమీకరణ జరుగకపోతే పార్టీ పరువుపోతుందని ప్రదేశ్ కాంగ్రెస్ నేత లు హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు గడుస్తు న్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు ప్రజల్లో ప్రభు త్వం పట్ల వ్యతిరేకతను కలుగజేసిందన్న భావ న నేతల్లో వ్యక్తమైనట్టు సమాచారం. సాగునీటి కొరత, విద్యుత్తు కోతలు, ఎండుతున్న పంటపొలాల వంటి అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభకు ప్రజాదరణ కరువైతే ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత జాతీయస్థాయిలో పరువు తీస్తుందన్న ఆందోళనతోనే వేదికను మార్చినట్టు తెలుస్తున్నది. ఈ ప్రభావం త్వరలో జరుగనున్న ఎ మ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై పడుతుందని కూడా భావించినట్టు తెలిసింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి జనసమీకరణ బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి పదివేల మందికిపైగా ద్వితీయ శ్రేణి నేత లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ఢిల్లీకి తరలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచరులతో ఢిల్లీకి రావాలనే ఆదేశాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

