MLC Jeevan Reddy | పోచారం కాంగ్రెస్‌లో చేరడం అవకాశవాద రాజకీయం.. ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయమని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు.
MLC Jeevan Reddy | జగిత్యాల, జూన్ 22 : మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయమని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని తెలిపారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని స్పష్టంచేశారు.
శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

