Congress MLA | కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
Congress MLA | కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు.
Congress MLA : కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే (Ibrahimpatnam MLA) మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) ఈ విధంగా పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు.
తెలంగాణ మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లానేనని, అలాంటి జిల్లాకు అన్యాయం చేయొద్దని అన్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్లని, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు.
ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డువస్తున్నాయంటే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రంగారెడ్డి చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం రాజీనామా చేసి వేరే సామాజిక వర్గం అభ్యర్థిని గెలిపించడానికి తాను రెడీగా ఉన్నానని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు గౌరవం ఇవ్వాలేగానీ, వెంటనే పదవులు ఇవ్వొద్దని సూచించారు.
పార్టీ కోసం ఆది నుంచి పనిచేసిన వాళ్లను పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. కనీసం పదేళ్లు కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని సూచించారు. పార్టీ లైన్ దాటకూడదు కాబట్టి ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడలేక పోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son Stabs Mother | తల్లిని కత్తితో పొడిచిన బాలుడు.. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య
OTT Releases | రణబాలి, జైలర్ 2.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

