కామారెడ్డి డిక్లరేషన్ హామీలేమాయే?
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని పలువురు వక్తలు ధ్వజమెత్తారు.
- 21 హామీల్లో ఒక్కటీ అమలు చేయని కాంగ్రెస్ సర్కార్
- మూడేండ్ల రేవంత్ పాలనలో ఓబీసీలకు తీరని ద్రోహం
- వచ్చే ఏడాది బీసీ చైతన్యయాత్ర
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, నవంబర్ 11: గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. నాడు కామారెడ్డిలో ఇచ్చిన 21 హామీల్లో ఒక్కదానినీ అమలు చేయని రేవంత్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం (బీసీఐఎఫ్), బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ కులాల ఐక్యవేదిక సంయుక్తాధ్వర్యంలో ‘కామారెడ్డి హామీలు-దగా పడ్డ బీసీలు’ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు అధ్యక్షత వహించారు.
సమావేశంలో ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, బీసీ ఐక్యవేదిక చైర్మన్ చిన్న రాములు ముదిరాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బీసీ డిక్లరేషన్‌లో బీసీల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దానిప్రకారం.. ఈ మూడేండ్లలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కానీ, కేవలం 33 వేల కోట్లు మాత్రమే కేటాయించి, ఒక్క శాతం నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని పెద్ద ప్రహాసనంగా పేర్కొన్నారు.
119 మంది ఎమ్మెల్యేల్లో బీసీలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారని, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీసీలు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేయడంతోపాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని మాజీ డీజీపీ పూర్ణచందర్రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో బీసీ నేతలు కర్ణాటి మనోహర్, ఎర్రమాద వెంకన్న చెన్నా శ్రీకాంత్, లింగేశ్ యాదవ్, కొండల్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

