MLA Kale Yadaiah | కాలె యాదయ్య(MLA Kale Yadaiah)హఠావో కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. నిన్నగాక మొన్న వచ్చిన కాలె యాదయ్య అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టారీతిగా వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య చెర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకో బచావో
గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు
కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా, కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తల ఆందోళన pic.twitter.com/ItxGHx4Uty
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2026