MLA Samelu | ఇతర పార్టీల నేతలను చేర్చుకోవద్దంటూ ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా నిరసన
MLA Samelu | కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పార్టీ ఫిరాయింపుల సొంత కార్యకర్తల(Congress acitivists) నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికొదిలేసి ఇల్లిల్లు తిరుగుతూ ఇతర పార్టీల నేత లను కాంగ్రెస్‌లో చేర్పిస్తుండటంతో మొదటి నుంచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పార్టీ ఫిరాయింపుల సొంత కార్యకర్తల(Congress acitivists) నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికొదిలేసి ఇల్లిల్లు తిరుగుతూ ఇతర పార్టీల నేత లను కాంగ్రెస్‌లో చేర్పిస్తుండటంతో మొదటి నుంచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
తాజాగా సూర్యాపేట(Suryapet) జిలా జాజిరెడ్డి గూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందులు సామేలుకు(MLA Samelu) సొంత పార్టీ నుంచే నిరసనలు(Protest) ఎదురయ్యాయి. ఓ కార్యక్రమ నిమిత్తం బొల్లంపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సామేలను గ్రామ పొలిమేరలోనే అడ్డగిం చేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే ఇది గమనించిన ఎమ్మెల్యే కాన్వాయ్ ఆపకుండానే వెళ్లిపోయారు.
తమకు తెలియకుండానే కార్యక్రమాలు చేయడం, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకొని వారికే పెద్ద పీట వేస్తున్నారని సామేలుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాదిగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న మమ్మల్ని ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తూ పక్కకు పెడుతున్నాడని నినాదాలు చేస్తూ రోడ్డు వెంట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులు మాని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు.
జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/LwuaJdVQUk
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

