హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ-హైదరాబాద్) వేదికగా బిగ్ డాటా ఎనలిటిక్స్పై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 19 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు దేశంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన ఐటీ నిపుణులు హాజరవుతున్నారు.