పైలట్ శిక్షణకు పేదరికమే అడ్డు

- కమర్షియల్ పైలట్‌గా బేగంపేటలో శిక్షణ
- 4 లక్షల ఫీజు చెల్లిస్తేనే నెరవేరనున్న కల
- ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
జమ్మికుంట, జనవరి 4: ఆమె కడు పేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆకాశంలో విహరించాలని కలలుగన్నది. గొప్ప పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. డిగ్రీ చదువుతూనే పరీక్ష రాసి కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. అయితే శిక్షణ కోసం రూ.4 లక్షలు చెల్లించలేని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెం దిన పాతకాల సదయ్య-రమల పెద్ద కూతురు స్పం దన చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. ఐదో తరగతి నుంచి ఇంటర్ దాకా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదివింది. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నది. ఫైనలియర్ చదువుతూనే పైలట్ పరీక్ష రాసింది. కమర్షియల్ పైలట్ శిక్షణకు ఎంపికై హైదరాబాద్‌లోని బేగంపేట ఏవియేషన్ అకాడమీలో శిక్షణ కోసం చేరింది. అయితే రూ.4 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉన్నది. అంత పెద్ద మొత్తం ఫీజు కట్టే స్థితిలో తల్లిదండ్రులు లేరు. ఫీజు కోసం స్పందన ఎదురుచూస్తుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తన కూతురు శిక్షణకు దాతలు ఆర్థిక సాయం అందజేయాలని వేడుకుంటున్నారు. దాతలు అకౌంట్ నం బర్ 50100266860852, ఐఎఫ్ఎస్సీ కోడ్: హెచ్డీఎఫ్సీ 0002237, హెచ్డీఎఫ్సీ జమ్మికుంట బ్రాంచిలో ఆర్థికసాయాన్ని జమచేయాలని కోరారు. వివరాలకు 99896 13004 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

