వాణిజ్య పన్నులశాఖ వన్ టైం సెటిల్మెంట్
న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి. కేసుల్లో తీర్పులు వచ్చి, డబ్బు రికవరీ చేయడం కష్టసాధ్యమని
న్యాయ వివాదాల్లోని చెల్లింపులకు బంపరాఫర్
రాష్ట్రంలో 3 వేలకోట్ల వరకు మొండి బకాయిలు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి. కేసుల్లో తీర్పులు వచ్చి, డబ్బు రికవరీ చేయడం కష్టసాధ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్‌ను ప్రకటించింది. బకాయిలపై భారీగా రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బీహార్, పశ్చిమబెంగాల్లో ఇలాంటి పథకం అమల్లో ఉన్నది. వీటిని అనుసరిస్తూ ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్-2022’ను ప్రకటించింది. రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ డీలర్లందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నది.
వివాదాస్పద పన్నులపై ఆఫర్లు ఇవే..
- జనరల్ సేల్స్ ట్యాక్స్ బకాయిలకు 60 శాతం రాయితీ. 40 శాతం చెల్లిస్తే చాలు.
- వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌కు సంబంధించిన వాటిలో సగం చెల్లిస్తే చాలు.
- మోటార్ వెహికిల్, గూడ్స్ ఎంట్రీ ట్యాక్స్ వివాదాలలో 40 శాతం రాయితీ.
- ఈ స్కీమ్‌కు అర్హులయ్యేవారికి ఇప్పటికే వేసిన మిత్తి, జరిమానా రద్దు చేస్తారు.
- ఈ పథకానికి ఎంపికైన దరఖాస్తుదారులకు కన్ఫర్మేషన్ లెటర్ అందజేస్తారు
- రాయితీ తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కన్నా ఎక్కువ ఉంటే.. నాలుగు వాయిదాల్లో కట్టేందుకు అవకాశం కల్పించారు. దీనికి మిత్తి ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా..
దరఖాస్తు, పరిశీలన, చెల్లింపుల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే. ప్రస్తుతం వ్యాపారంలో లేని వారు నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు.
- n దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జూన్ 30 వరకు సమర్పించాలి.
- n జూలై ఒకటి నుంచి 15 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు.
- n ఇందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో డివిజన్, సర్కిల్‌కు చెందిన అసిస్టెంట్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు.
- n డిస్కౌంట్‌కు ఎంపికైన వారు జూలై 16 నుంచి ఆగస్టు 15 మధ్య సెటిల్మెంట్ లెటర్‌ను, డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

