థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్!
కాంగ్రెస్ సర్కార్ నిర్వహణ లోపాలతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుదుత్పత్తి కేంద్రాలను బొగ్గుకొరత పట్టి పీడిస్తున్నది. రాష్ట్రంలోని జెన్కో థర్మల్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందకపోవడంతో నిల్వలు తగ్గుతున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనల ప్రకారం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి.
- తగ్గుతున్న బొగ్గు నిల్వలు
- ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే
- వైటీపీఎస్‌లో 5 రోజులకు మాత్రమే..
- సీఈఏ నిబంధనల మేరకు 21 రోజులకు సరిపడే నిల్వలుండాలి
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ నిర్వహణ లోపాలతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుదుత్పత్తి కేంద్రాలను బొగ్గుకొరత పట్టి పీడిస్తున్నది. రాష్ట్రంలోని జెన్కో థర్మల్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందకపోవడంతో నిల్వలు తగ్గుతున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనల ప్రకారం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ప్లాంట్‌లోనూ 21 రోజులకు సరిపడా కోల్స్టాక్స్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం సగటున కేవలం 9 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)లో కేవలం 5 రోజులకు సరిపడ నిల్వలే ఉండటం గమనార్హం.
ఈ ప్లాంట్‌పై రేవంత్ సర్కార్ వివక్ష కారణంగా అవసరం మేరకు బొగ్గు సరఫరా కావడం లేదని ఉద్యోగ వర్గాలే చెప్తున్నాయి. రాష్ట్రంలో కొంత మేరకైనా బొగ్గు నిల్వలున్న ప్లాంట్ ఏదైనా ఉన్నదంటే అది భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ప్లాంట్ మాత్రమే. తాడిచెర్ల కోల్‌బ్లాక్ జెన్కోకు చెందినది. రోడ్డుమార్గంలో 11 వేల మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అవుతుండగా.. ఈ ఒక్క ప్లాంట్‌కు మాత్రమే అంతో ఇంతో బొగ్గు అందుతున్నది. వైటీపీఎస్‌కు బొగ్గు లింకేజీ లేదని, సరిపడా బొగ్గు అందడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అంతా ఆరోపణలు చేస్తున్నారు. మరి మిగతా ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలెందుకు లేవన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. మిగతా వాటికి బొగ్గు లింకేజీ ఉన్నా సరిపడా నిల్వలు ఎందుకు ఉంచలేకపోతున్నారని విద్యుత్తురంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
వైటీపీఎస్‌లో వేధిస్తున్న బొగ్గు కొరత
రాష్ట్రంలో అతిపెద్ద విద్యుదుత్పత్తి ప్లాంట్ వైటీపీఎస్‌లో ప్రస్తుతం 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌లో రోజువారీ బొగ్గు వినియోగం 27 వేల మిలియన్ టన్నులు. కానీ ఈ ప్లాంట్‌కు సరఫరా అవుతున్న బొగ్గు 23,964 మిలియన్ టన్నులే. అంటే 3,036 మిలియన్ టన్నుల బొగ్గు తక్కువగా అందుతున్నది. నెలకు సగటు వినియోగం 3,33,603 మిలియన్ టన్నులుంటే.. ఈ ప్లాంట్‌కు అందుతున్నది 3,25,814 మిలియన్ టన్నులు. అంటే నెలకు సగటున 7,789 మిలియన్ టన్నులు బొగ్గు కొరత సమస్య ఈ ప్లాంట్‌ను వేధిస్తున్నది. నైనీ నుంచి బొగ్గును తెప్పిస్తున్నా కొరత తీరడం లేదు. ఈ ప్లాంట్‌లోని ఐదో యూనిట్ ఇంకా అందుబాటులోకే రాలేదు. నడుస్తున్న నాలుగు యూనిట్లలో 800 మెగావాట్ల యూనిట్ -1 నడువడమే లేదు.

విద్యుదుత్పత్తి ప్లాంట్లలో ఇదీ పరిస్థితి
- కొత్తగూడెంలో స్టేజ్-5, స్టేజ్-6 (వెయ్యి మెగావాట్లు) థర్మల్ ప్లాంట్లలో రోజువారీ వినియోగం 13,500 మిలియన్ టన్నులు. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో 1,33,916 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. ఇది 10 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఈ ప్లాంట్‌కు రుద్రంపూర్, సత్తుపల్లిలోని సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి జీ-15, రుద్రంపూర్ నుంచి జీ-14 గ్రేడ్ బొగ్గు మాత్రమే అందుతున్నట్టు సమాచారం.
- కొత్తగూడెంలోని స్టేజ్-7 (800 మెగావాట్లు)లో రోజువారీ వినియోగం 8,100 మిలియన్ టన్నులు. ఈ ప్లాంట్‌కు రోజూ సరఫరా అవుతున్న బొగ్గు 7,670 మిలియన్ టన్నులే. అంటే 430 మిలియన్ టన్నుల బొగ్గు తక్కువగా అందుతున్నది. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 1,04,426 మిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉండగా, 13 రోజులకే సరిపోతుంది.
- కాకతీయ థర్మల్ ప్లాంట్ (1,100 మెగావాట్లు) రోజువారీ సగటు వినియోగం 13,000 మిలియన్ టన్నులు. ఈ ప్లాంట్‌కు రోజుకు సరఫరా అవుతున్న బొగ్గు 24,127 మిలియన్ టన్నులు. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం, 1,41,1004 మిలియన్ టన్నుల బొగ్గు అందుతున్నది. ఉన్న నిల్వలు 11 రోజులకు మాత్రమే సరిపోతాయి.
- భద్రాద్రి ప్లాంట్‌లో (1,080 మెగావాట్లు) ప్రస్తుతం 1,26,741 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ నిల్వలు 10 రోజులకే సరిపోతాయి. ఈ ప్లాంట్ రోజువారీ వినియోగం 13,200 మిలియన్ టన్నులు. ఈ ప్లాంట్‌కు సింగరేణి నుంచి రోజుకు 14,206 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే అందుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

