యూనిఫామ్స్‌పై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోండి
ఈ ఏడాది అందించిన సూల్ యూనిఫాంలపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది అందించిన సూల్ యూనిఫాంలపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాలు, పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు, కిట్ల పంపిణీ పురోగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యూనిఫామ్‌తో పాటు టై, బెల్టులు, ఐడీకార్డులు, షూ, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కార్పెట్లు, సూల్బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని వెల్లడించారు.
వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు, ఇతర సామగ్రికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, పాఠశాలలు తెరిచిన రోజునే మొత్తం వస్తువులు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, రాహుల్ బొజ్జా, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

