హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో(Gain purchases) ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్‌లో(ట్విటర్) ట్వీట్ చేశారు. జనగామ(anagama) వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటన పై ఆయన సకాలంలో స్పందించారు.
రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదే శించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ని సీఎం అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.