వైభవంగా లష్కర్ మహంకాళి బోనాలు
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్లో అధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని బంతిపూలతో అందంగా తీర్చిదిద్దారు.
- అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
- బోనం సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
బేగంపేట, జూలై 21: సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్లో అధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని బంతిపూలతో అందంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం సమర్పించగా.. 8.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా అమ్మవారికి బోనం సమర్పించారు.
జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దేవాదాయ శాఖతోపాటు పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన సాధరణ భక్తులకు 3, బోనాలు సమర్పించే మహిళలకు 2, వీఐపీలకు ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది భక్తులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం జలమండలి అధికారులు తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతరను తిలకేంచేందుకు వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు వివిధ విభాగాల వలంటీర్లు సహాయ సహాకారాలు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

