CM Revanth | స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం సమావేశం
CM Revanth | రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ నెల 23లోపు యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల, విద్యాశాఖల అధికారులతో పాటు పారిశ్రామికరంగ ప్రముఖులకు సూచించారు.
CM Revanth | రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ నెల 23లోపు యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల, విద్యాశాఖల అధికారులతో పాటు పారిశ్రామికరంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో సీఎం సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్పై సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులు, ప్రముఖల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. యూనివర్సిటీలో ఏం కోర్సులు ఉండాలి.. ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి.. పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ ఐదురోజులకోసారి సమావేశం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా..? ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా? మరేదైనా విధానం అనుసరించాలా ? అనే అంశంపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని, వ్యవహారాలకు పరిశ్రమలశాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

