Konda Surekha | మంత్రి పదవి తొలగింపులో కుట్ర ఉంది. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి నాపై కుట్రలు చేశారు. నా కూతురు మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో కొండాసురేఖ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను తీసేసి నా వల్ల ముగ్గురు మహిళలకు పదవులు ఇచ్చారు. అందులో ముగ్గురు బీసీలకు పదవులు రావడం సంతోషం. పద్మశాలీలకు, మున్నూరు కాపులకు పదవులు దక్కాయన్నారు.
నా కూతురు ఇండిపెండెంట్.. తన అభిప్రాయం చెప్పింది. నేనే ఏ తప్పూ చేయలేదు. పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు. సుస్మితతో మేం మాట్లాడించలేదు. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మీనాక్షి నటరాజన్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. రాజీనామా అడిగితే కనీసం కారణం అడిగే అవకాశం ఉండేది.. కారణం చెప్పకుండా నన్ను బర్తరఫ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెను తీసేస్తారా.. నన్ను వెళ్లిపోమంటారా.. అని బ్లాక్ మెయిల్ చేశారు. కావాలని కక్షగట్టి మహిళపై చర్యలు తీసుకున్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి సుమంత్ అనుచరులను అరెస్ట్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు.
అడ్రస్ లేకుండా లేఖ..
కొద్దిసేపటి క్రితం ఓ లేఖ విడుదలైంది. ఆ లేఖపై ఓ అడ్రస్ లేదు.. సంతకం లేదు… నేనెక్కడా కూడా సీఎంను ఒక్క మాట అనలేదు. ఎక్కడా పార్టీని ఒక మాట అనలేదు. ఏం అనకపోయినా నాకు షోకాజ్ నోటీసులు ఇస్తే నేనే దానికి సమాధానం చెప్తే దానికి సంతృప్తి చెందకుండా ఈ రోజు నాపై చర్యలు తీసుకోవాలని ఎవరైతే రికమండేషన్ చేశారో.. మల్లు రవి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన వారే.. ఈ రోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని తిట్టినవాళ్లేనని కొండాసురేఖ అన్నారు. రోశయ్య ఇందిరాగాంధీని విధవ రాజ్యమేలుతుందని తిట్టారు.. జైపాల్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఇందిరాగాంధీని తిట్టినట్వంటి వ్యక్తే. తిట్టినవాళ్లంతా కూడా చాలా మంది పొజిషన్లలో ఉన్నారు. కానీ నిన్న నా కూతురు ఏదో అంటే నా మీద కక్ష తీర్చుకోవడం చాలా బాధాకరమన్నారు. చాలా మంది బయట మాట్లాడుతున్నారు.. మరి వాళ్లందరి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు.
రూ.50 కోట్లు ఇచ్చి సీఎం పదవిని కొనుక్కున్నారని మీ మీద ఆరోపణలు చేసిన వారిని కూడా చైర్మన్ పదవులు ఇచ్చి సన్మానించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. నేను ఏ ఒక్క మాట కూడా సీఎంపై మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉండగానే మా మనుషులను ఇబ్బంది పెట్టారు. సుమంత్‌పై పెట్టిన కేసులను వత్ డ్రా చేయాలని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ పీసీసీ కావాలని మొదట కోరుకున్నది మేమే. వైఎస్ తర్వాత ఎక్కువ అభిమానించింది రేవంత్ రెడ్డినే. భార్య కూడా ఓటేయని నేత కూడా హీరోలాగా మాట్లాడుతున్నారు. నాకు మంత్రి పదవి ఆభరణం మాత్రమే.. మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు. నన్ను ఏ మాత్రం అడగకుండా తీసేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. దీనిపై సీఎం, ఏఐసీసీ సమాధానం చెప్పాలి.
నన్ను అడగకుండానే బర్తరఫ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా హ్యాపీగా ఉన్నారా..? గుండెలపై చేయి వేసుకుని చెప్పాలన్నారు కొండా సురేఖ. మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు.. ఈరోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండిమనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు.. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది.. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నన్నారు. తాను పార్టీకి రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్‌లో ఉంటా.. ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగుతా.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా?
మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు
ఈరోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది
ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి
మనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు.. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది
కాంగ్రెస్ పార్టీ పట్ల… https://t.co/1R8xdQuR7G pic.twitter.com/XwjGFb4exW
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
ఒక మోనోపోలీ లాగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు
తనకు తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకోవడం, ఇంకో ఎమ్మెల్యే అభ్యర్థి పేరును ప్రకటించడం సరికాదు
ఒక్క వేలు నా వైపు చూపిస్తే అతని వైపు నాలుగు వేల్లు చూపిస్తాయి అని మరిచిపోవద్దు
యాదాద్రి పాలకమండలి మీద ఎవరి… https://t.co/vuhlcAqzCp pic.twitter.com/n4JEhaxrkX
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
బ్రేకింగ్ న్యూస్
కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల… https://t.co/rkt0Obweqz pic.twitter.com/rls2CaNOV2
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు