సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి : మంత్రి సత్యవతి రాథోడ్
అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ,దేశానికే దిక్సూచిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని
మహబూబాబాద్ : అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశానికే దిక్సూచిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారని కొనియాడారు. రాష్ట్రంలోని నూతన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ గా అని పేరు పెట్టి దళితులపై ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పారని వెల్లడించారు.
దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో త్వరలో ప్రారంభించుకో బోతున్నామని వివరించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాల్లో చదివే వారికి 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తున్నారని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ తరపున స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, సంజీవ , కిషన్,ఆర్డీవో కొమురయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

