KCR Nutrition Kit | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
KCR Nutrition Kit | గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు కిట్లను అందజేయనున్నారు.
KCR Nutrition Kit | గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు కిట్లను అందజేయనున్నారు. రెండో విడుత న్యూట్రిషన్ల కిట్ల పంపిణీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో ఆరుగురు గర్భిణులకు సీఎం కిట్లను అందజేయనున్నారు.
అయితే, తొలి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో కిట్లను పంపిణీ చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఈ కిట్‌లో ఏడు రకాల వస్తువులుంటాయి. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ కలిపి కిట్ రూపంలో అందించనున్నారు. రెండు, మూడో ఏఎన్సీ చెకప్‌ల సమయంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.250 కోట్లు కేటాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

