Harish Rao | ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ సీఎం కేసీఆరే : మంత్రి హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు అని మంత్రి తేల్చిచెప్పారు.
Harish Rao | సిద్దిపేట : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు అని మంత్రి తేల్చిచెప్పారు. దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రామలింగారెడ్డి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని ఊహించలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనం అని పేర్కొన్నారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి ఆయన.. అందరి కంటే భిన్నంగా ఉండేవారని మంత్రి గుర్తు చేశారు. రామలింగారెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో జోడెడ్లుగా రామలింగారెడ్డి తాను కలిసి పని చేశాం. మానుకోట, మనోహరాబాద్ రైల్వే రోకో, హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, నిరసనలు, 48 గంటలు నిద్రాహారాలు మానుకుని చేసిన జ్ఞాపకాలను హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం లెక్క చేయకుండా పని చేసి లింగన్న ప్రాణాలు కోల్పోయారు.
రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక మూడేళ్లలో చేసిందేమీ లేదు. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట. బీజేపీ రఘునందన్ రావు మాయ మాటలు నమ్మి సోలిపేట సుజాత అక్కకు అన్యాయం చేశారు. రఘునందన్ అరచేతిలో వైకుంఠం చూపితే దుబ్బాక ప్రజలుగా నమ్మి మోసపోయాం. ఈ ఎన్నికల్లో మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. సోలిపేట కుటుంబానికి అండగా ఉంటా.. రాజకీయంగా నిలబెడతానని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

