యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
Yadadri | యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులను వేద

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులను వేద పండితులు ఆశీర్వదించారు.
సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు.
మంగళవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. పూర్తికావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియాకు సీఎం తెలియజేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

