Bharat Bhavan | దేశంలో మరే పార్టీకీ లేనివిధంగా శిక్షణ, పరిశోధనా కేంద్రం.. నేడు భారత్ భవన్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నది.
- సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్చార్డీగా ఏర్పాటు చేయనున్న బీఆర్ఎస్
- 15 అంతస్థుల్లో భారీ భవనం
- నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- దేశంలో మరే పార్టీకీ లేనివిధంగా శిక్షణ, పరిశోధనా కేంద్రం
- అతి పెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
- మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ఆహ్వానం
Bharat Bhavan | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నది. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. ఈ భవన నిర్మాణ పనులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రం
దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ర్టాలవారీగా, రంగాలవారీగా వివరాలను సమీకరించడం, వాటిని క్రోడీకరించడం వంటివి ఇక్కడ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు.
శిక్షణకు వచ్చేవారు బస చేసేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా ఉంటాయి. దేశంలోనే అత్యంత పేరున్న సంస్థల్లో పనిచేసిన కొందరు సీనియర్లను శిక్షణ, పరిశోధన కార్యక్రమాల కోసం నియమించనున్నారు. రిటైర్డ్ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్ నిపుణులుగా నియమించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు, మంత్రులు, హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

