ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో మునుగోడు బయల్దేరనున్న సీఎం కేసీఆర్
CM KCR | మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది
హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు.
ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు.
ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

