సంస్కారయుత పోలీసింగ్!
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా దృష్టిసారించాలి.
- తెలంగాణలో నూతన అధ్యాయం
- పనివిభజన, సాంకేతికత వినియోగంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్
- కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో ప్రపంచ స్థాయికి ఎదిగిన ప్రమాణాలు
- ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఎనిమిదేండ్లలో ఎన్నెన్నో సంస్కరణలు
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా దృష్టిసారించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు పడతాయి. తెలంగాణ పోలీస్‌శాఖ సైతం సరిగ్గా ఇదే రీతిలో ముందుకెళ్తున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్, సంస్కారవంతమైన పోలీసింగ్ రావాలన్న సీఎం కేసీఆర్ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అనేక రకాల సంస్కరణలకు ఈ ఎనిమిదేండ్లలో శ్రీకారం చుట్టారు పోలీస్ ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, మార్గదర్శనంలో అనేక చర్యలు తీసుకొన్నారు. మరిన్ని తీసుకొంటున్నారు. వాటి ఫలితాలు క్రమంగా క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తున్నాయి. ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేయడంలో ఆ మార్పు సుస్పష్టంగా కనిపిస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ (పని విభజన) విధానం సత్ఫలితాలు సాధిస్తున్నది. రోజువారీ పోలీసు విధుల నిర్వహణను మరింత సులభతరం చేయడమే కాకుండా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నది. పోలీస్ శాఖలో ప్రస్తుతం 17 ఫంక్షనల్ వర్టికల్స్ అమలు చేస్తున్నారు. సిబ్బంది ఆసక్తి, సామర్థ్యాల ఆధారంగా వారికి పనులు అప్పగిస్తుండటంతో ఆయా అంశాల్లో వారు సంపూర్ణ అనుభవం గడించేందుకు దోహదపడుతున్నది. అంతేకాకుండా ఆయా అంశాలపై స్టేషన్, సరిల్, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయడంతో సమాచార మార్పిడి జరిగి నైపుణ్యాల పెంపుదలకు తోడ్పుడుతున్నది.
పని విభజన ఇలా..
- ప్రజల నుంచి ఫిర్యాదుల సేకరణకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి, వారికి తగిన సమాచారం ఇచ్చేందుకు 24 గంటల పాటు ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.
- పోలీస్‌స్టేషన్ రికార్డుల నిర్వహణ కోసం స్టేషన్రైటర్ను, క్రైం, క్రిమినల్ రికార్డుల నిర్వహణ కోసం క్రైంరైటర్ను ఏర్పాటు చేశారు. ప్రాపర్టీ సంబంధిత కేసుల పరిశోధనలో క్రైం స్టాఫ్ భాగం పంచుకొంటున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం మరే రాష్ట్రంలో లేని విధంగా పోలీస్ సిబ్బందికి టూ వీలర్, ఫోర్ వీలర్లు సమకూర్చడంతో హైదరాబాద్‌తో పాటు మారుమూల మండలాల్లో సైతం బ్లూకోల్ట్స్ ఆధ్వర్యంలో నిరంతర నిఘా కొనసాగుతున్నది.
- నగరాలు, పట్టణాల్లో పాట్రోకార్ సిబ్బంది నిరంతరం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తుండటంతో విజిబుల్ పోలీసింగ్ పెరిగింది. దీంతో నేరం చేయాలంటేనే నేరస్థులు జంకే పరిస్థితి ఏర్పడింది.
- ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందికి కోర్టు డ్యూటీలను అప్పగించారు. వారికి అవసరమైన శిక్షణతో పాటు నేరస్థులకు శిక్షపడిన కేసుల్లో అవలంబించిన ఉత్తమ విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తుండటంతో రాష్ట్రంలో కన్విక్షన్రేట్ పెరిగింది. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసుల్లో వారెంట్లు పెండింగ్ లేకుండా నిరంతర ఫాలోఅప్ చేస్తున్నారు.
- పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎప్పటికప్పుడు సమన్లు, నోటీసులు జారీ చేస్తుండటంతో నేరస్థులపై నిఘా పెరుగుతున్నది.
- నేర పరిశోధన, నేర నియంత్రణకు తెలంగాణ పోలీసులు సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. హాక్ఐ మొబైల్యాప్ పౌరులకు పోలీస్ సేవలందించే అరచేతిలో అస్త్రంగా మారింది. ఏ ఆపద సమయంలోనైనా చిన్న బటన్ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ నిర్మితమైంది.
- కేసు దర్యాప్తు, నేర నిరూపణలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలు, నిపుణుల అభిప్రాయ సేకరణ, ఇతర రిపోర్టులను ఫాలో అప్ చేసే బాధ్యతలను సిబ్బందికి అప్పగించడంతో కేసులు వీగిపోకుండా నిందితులకు శిక్షలు పడుతున్నాయి.
- ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సిబ్బంది విధుల సమన్వయం, పౌరులకు పోలీస్‌సేవలు సకాలంలో అందేలా చూసేందుకు సెక్షన్ డ్యూటీ ఇన్చార్జిని ఏర్పాటుచేశారు.
- పోలీస్‌స్టేషన్ నిర్వహణలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు సహాయం పడేందుకు సబ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్‌ను కేటాయించారు. దీంతో పని ఒత్తిడి తగ్గుతున్నది.
- స్టేషన్ పరిధిలో నమోదైన నేరాల పరిశోధన, నేరాల నియంత్రణ, ప్రాపర్టీ నేరాలను మానిటర్ చేయడం వంటి విధులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిర్వహిస్తున్నారు.
- ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అన్ని రకాల కేసుల పరిశోధనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.
- సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్లు పట్టణ, నగర ప్రాం తాల్లో ప్రత్యేకమైన దృష్టితో పనిచేస్తున్నారు.
- స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తన పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని విషయాలకు స్థూలంగా జవాబుదారీగా ఉంటూ, నేరాల కట్టడికి చర్యలు తీసుకొంటున్నారు. కమ్యూనిటీతో నిరంతరం టచ్‌లో ఉండటంతో ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత చేరువ అవుతున్నది.
పౌరుల నుంచి ఫీడ్‌బ్యాక్: పోలీస్ సేవలు, అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు థర్డ్‌పార్టీ కాల్ సెంటర్ల ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీనితో ప్రజలు స్వేచ్ఛగా తమ ఇబ్బందులు, అనుభవాలు పంచుకొంటున్నారు. దానికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తనలో ఎప్పటికప్పుడు మార్పు తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
హాక్ఐ: పౌరుల చేతికి తెలంగాణ పోలీసులు ఇచ్చిన బ్రహ్మాస్త్రం హాక్ఐ. ఏ ఆపదైనా సరే ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు. అత్యవసరాల్లో సేవలు పొందవచ్చు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు హాక్ఐ ఎంతో భరోసా ఇస్తున్నది. పబ్లిక్ క్యాబ్‌లను సైతం పోలీస్ పాట్రోకార్లకు అనుసంధానించడం మరో ముందడుగు.
పెరిగిన సాంకేతికత: గతంలో పోలీస్ అనగానే చేతిలో లాఠీ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు చేతిలో ట్యాబ్‌తో ఉండే స్మార్ట్ తెలంగాణ పోలీస్ బొమ్మ మదిలో మెదులుతున్నది. చాలావరకు పోలీసుల రోజువారీ విధులను టీఎస్ కాప్ మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పాస్‌పోర్టుల జారీలో సైతం రికార్డు టైంలోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తవుతున్నది.
జీరో ఎఫ్ఐఆర్: దిశ ఘటన తర్వాత అమల్లోకి తెచ్చిన జీరో ఎఫ్ఐఆర్ విధానంతో బాధితుల్లో మరింత భరోసా పెరిగింది.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక విభాగం:
దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ ఆలోచనలతో మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు. లైంగిక దాడుల్లో బాధితులైన చిన్నారులు, మహిళలకు న్యాయ, పోలీస్, మెడికల్ వంటి సాయం ఒకేచోట అందించేలా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కమ్యూనిటీ పోలీసింగ్
ప్రజలను సైతం శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగస్వాములు చేసేలా తెలంగాణ పోలీసులు తీసుకొచ్చిన కమ్యూనిటీ పోలీసింగ్‌కు సానుకూల స్పందన వచ్చింది. దీంతో పోలీసులు పౌరులకు మరింత చేరువ కాగలిగారు. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ద్వారా భద్రతకు పెద్దపీట వేశారు. జాబ్ కనెక్ట్ కార్యక్రమాల ద్వారా యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగాలు ఇప్పించేలా ఆయా సంస్థలతో సమన్వయం చేసుకోవడం కూడా ప్రజలకు పోలీసులను మరింత చేరువ చేస్తున్నది.
ట్రాఫిక్ నియంత్రణలో సాంకేతికత
ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల ఉల్లంఘనలపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాల్లోనూ తెలంగాణ పోలీసులు సాంకేతికత వినియోగాన్ని పెంచారు. ఇందుకోసం ఈ-చలాన్, ట్రాఫిక్ లైవ్ మొబైల్ యాప్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) వంటి అనేక విధానాలు అవలంబిస్తున్నారు.
హైదరాబాద్‌లోని పోలీస్స్టేషన్లలో
ఏ విధమైన సేవలు పౌరులకు అందుతున్నాయో.. రాష్ట్రంలోని మారుమూల పోలీస్స్టేషన్లోనూ అదే తరహా సేవలందించాలన్నదే తెలంగాణ పోలీస్ లక్ష్యం.
-పలు సందర్భాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి
తెలంగాణ పోలీసులు సంస్కారవంతమైన పోలీస్‌గా పని చేయాలి. సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మాణమై భారతదేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ ఓ కలికితురాయి కావాలని కోరుకొంటున్నా. ఎంత చదువుకొన్నా.. ఎంత విజ్ఞత ఉన్నా.. సంస్కారం కొరవడితే ఏ మాత్రం బాగుండదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలన్నదే నా కోరిక.
-కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభంలో సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

