CM KCR | అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు : సీఎం కేసీఆర్
CM KCR | అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | అందోల్ : అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
అందోల్ నియోజకవర్గంలోని దళితబిడ్డలు ఆలోచించాలి. అనేక వేల ఏండ్లుగా దళితజాతి అణిచివేతకు, వివక్షకు గురైన జాతి. వాళ్లు మన సాటి మనషులే కదా..? వాళ్లు కూడా పైకి రావాలి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా వారిని అలానే ఉంచడం ధర్మం కాదు. వాళ్లకు నిజంగానే నిజాయితీ ఉండి, నాడే దళితబంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి ఉంటే ఎందుకు ఇవాళ దళితుల్లో దరిద్రం ఉండేది. సమాజంలో అందరికన్నా పేదవాళ్లు దళితులే కదా..? దళితబిడ్డలకు చెప్తున్నా.. ఒక్క ఓటు కూడా అటు ఇటు వేయండి. క్రాంతి కోరినట్టు ఒకే విడుతలో ఆందోల్‌కు దళితబంధు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, ఆందోల్ నియోజకవర్గం యొక్క దళితవాడల్లో నుంచి దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం అని కేసీఆర్ అన్నారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు
ఎస్టీ బిడ్డలు 50 ఏండ్లు కొట్లాడారు మా తండాలో మా రాజ్యం కావాలని. 3,500 తండాల్లో ఎస్టీలే రాజ్యం ఏలుతున్నారు. మన జోగిపేటలో 14 మంది ఎస్టీ సర్పంచ్‌లు ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున తప్పకుండా సెలవు కూడా ఇస్తామని ప్రకటిస్తున్నా అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

