ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకుంటం.. రేపు ఢిల్లీకి వెళ్తున్నం : సీఎం కేసీఆర్
CM KCR Press Meet | యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్లో

హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్లో మీడియా మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్ ఇవ్వండి.. దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటది. అందువల్ల చేయమని రెక్వెస్ట్ చేసినం. ఎందుకోమరి సరైన పద్ధతుల్లో రావడం లేదు. మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నం.
మంత్రుల డెలిగేషన్, పార్లమెంట్ సభ్యులు డెలిగేషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫైనాన్స్ సెక్రెటరీ, అగ్రికల్చర్ సెక్రెటరీ, సివిల్ సప్లయ్ సెక్రెటరీ అధికారులు డెలిగేషన్ కలిసి మంత్రిని, అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానిని కలిసి డిమాండ్ చేద్దాం అనుకుంటున్నం. ఎందుకంటే అనురాధ కార్తి నిన్న ప్రారంభమైంది. రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు కన్ఫ్యూజన్లో పడ్తరు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటది. రైతులు తమకు ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. మొన్న గాలివార్త వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడుతామని, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినట్లు వార్త వచ్చింది. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. బహుశా రెండు రోజులు పట్టొచ్చు. దాని దరిమిలా తెలంగాణ రైతాంగానికి ఏందనేది విషయాన్ని తెలుపుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

