హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సబ్బం డ వర్ణాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన పాపన్న వీరగాధను ఆయన జ యంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
ఆనాటి సమాజం లో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా పాపన్న సబ్బండ వర్ణాలను ఏకంచేసి పోరాడిన తీరు గొప్పదని తెలిపారు. పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తూ బడు గు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నద ని చెప్పారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తున్నదని తెలిపారు.