CM KCR | ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్
CM KCR | రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహ్మాండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇక సిద్దిపేటకు అన్ని వచ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.
CM KCR | సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహ్మాండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇక సిద్దిపేటకు అన్ని వచ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు. నేను హరీశ్‌రావును పొగిడినట్టు అయితది. ఒకటే మాటకు నూరు అర్థాలు తీసుకోవాలి అని కేసీఆర్ సూచించారు. నేను కరీంనగర్ ఎంపీగా గెలిచాను.. తెలంగాణ కోసం ఢిల్లీకి పోయి పని చేయాలి. రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి. నా కన్న ఊరిని, నన్ను పెంచిన మిమ్మల్ని అందర్నీ విడిచి పెట్టిపోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్డులో ఓ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓ దిక్కు నేను ఏడ్వ.. ఇంకో దిక్కు హాల్ మొత్తం ఏడ్వ.. అందరం కూడా ఓ పది నిమిషాలు ఏడ్సినం అని కేసీఆర్ తెలిపారు.
హరీశ్‌పై మంచి జోక్ ఉంది..
ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో నేను తీసుకొచ్చి ఓ ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌ను మీకు అప్పగిస్తే, బ్రహ్మాండంగా నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా పని చేసి నా మాటను నిలబెట్టాడు. మీ గౌరవాన్ని కాపాడాడు అని ప్రశంసల వర్షం కురిపించారు. హరీశ్ రావు మీద మన ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో ఒక జోక్ ఉంది. జోక్ ఏందంటే.. హరీశ్ అటు తిరుగుతడు.. ఇటు తిరుగతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు అని చెబుతారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
హరీశ్ జాగలా నేనున్న ఇంత పని చేయకపోయేవాడినేమో..
ఆయన టైమ్‌లో మంత్రి నుంచి నేటి దాకా ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో హరీశ్ అద్భుతమైన కృషి చేశారని సీఎం తెలిపారు. నిజంగా హరీశ్ జాగలా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుదోనో లేదో నాకు తెల్వదు. అంత అద్భుతంగా పని చేస్తున్నారు. నేను ఇంతకన్న ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దిపేటకు నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తల్లు దుంకుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సంతోషపడుతున్నాను. నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాంలు చూసినప్పుడు బ్రహ్మాండంగా మనసు పులకించి పోయిందని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

