మన సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన: సీఎం కేసీఆర్
CM KCR | దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగినప్పుడు అనేక అనుమానాలు ఉండేవన్నారు. అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అన్నీ అధిగమించి ప్రగతి పథంలో నడుస్తున్నామన్నారు.
ఏ రాష్ట్రం సాధించనన్ని అద్భుత ఫలితాలు తెలంగాణ సాధించిందని, దళితబంధు వంటి అనేక ఆవిష్కరణలు గావించామని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక విషయాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పారు. చాలా రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందని చెప్పారు. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. మనందరి సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన అన్నారు.
తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని, రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ భూమి ధర పెరిగిందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని చెప్పారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని వెల్లడించారు. కులం, మతం, జాతి వివక్ష లేకుండా ముందుకువెళ్తున్నామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

