సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జాతీయ రైతు సదస్సు
CM KCR | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించనున్నారు. అనంతరం రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. లంచ్ అనంతరం సదస్సు తిరిగి కొనసాగనుంది.
తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ర్టాలకు చెందిన వందమందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం రాష్ర్టానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు వచ్చారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతుప్రతినిధుల బృందం.. మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నది. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను వారు ప్రారంభించారు. మల్లన్నసాగర్, సింగాయపల్లిల్లో పర్యటించిన రైతు ప్రతినిధులు.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

