‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
CM KCR | CM KCR | ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (BRS)’ తొలి ఆంగ్ల పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.
CM KCR | ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (BRS)’ తొలి ఆంగ్ల పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదు సంవత్సరాలుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా.. సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు ఈ పుస్తకాన్ని రచించగా.. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రచురించారు.
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వాలా నరసింహారావు, జూలూరీ గౌరీశంకర్‌ను అభినందించారు. 2018 మార్చి 3న ప్రగతిభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పు ఆవశ్యకతను వివరించారు. ఆ మార్పు కోసం అవసరమైతే, ప్రజలు కోరుకుంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న అభీష్టాన్ని సైతం వెలిబుచ్చారు.
అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన దరిమిలా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి.. 2023 ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ సభ వరకు 35 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాగా, బీఆర్ఎస్ ఆవిర్భావ, ఆరోహణా క్రమాన్ని మాత్రమే కాకుండా, వర్తమాన జాతీయ రాజకీయాల గురించి పరిశోధనా దృక్పథంతో అధ్యయనం చేసే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

