దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ

- రాష్ట్ర ప్రగతిలో ముఖ్యమంత్రిది నిరంతర కృషి
- కొనియాడిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
- గవర్నర్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, అతి తక్కువ సమయంలోనే అపూర్వప్రగతి సాధించి చాలా అంశాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశంసించారు. బంగారు తెలంగాణ నిర్మాణం వైపు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో సీఎం కేసీఆర్ నిరంతర తపన, కృషిని అభినందించారు. గవర్నర్‌తో సీఎం కేసీఆర్ బుధవారం రాజ్‌భవన్‌లో భేటీఅయ్యారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకేరోజు కావడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సీఎం కేసీఆర్‌ను సత్కరించారు. గవర్నర్‌కు మంత్రి సత్యవతిరాథోడ్ శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
రాజ్‌భవన్‌లో అధికారులకు సన్మానం
రాష్ట్ర అవతరణ వేడుకలను రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం పేదలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకుకు గవర్నర్ నిత్యావసరాలను పంపిణీచేశారు. అనాథలకు లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ కిట్స్ అందజేశారు. కరోనా విపత్తులో సేవలందించిన గాంధీ, కింగ్‌కోఠి, ఆయుర్వేదిక్ దవాఖాన సూపరింటెండెంట్లు డాక్టర్ రాజారావు, డాక్టర్ రాజేంద్రనాథ్‌లను సన్మానించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్‌భగవత్, మిలటరీ అధికారులు ఏ జోషి, ఇందర్దీప్సింగ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి కే పిచ్చిరెడ్డిని గవర్నర్ సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

