హైదరాబాద్: ప్రముఖ నటుడు చలపతిరావు మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. చలపతిరావు మరణం సినీరంగానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు వెండితెరపై నటుడు చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు.
వందలాది చిత్రాల్లో చలపతిరావు వైవిధ్యమైన పాత్రలు పోషించారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. చలపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.