మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీఎం కేసీఆర్| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.
ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయనతోపాటు కుంటుంబ సభ్యులు యశోద దవాఖానలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మంగళవారం ఉదయం మృతిచెందారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఎస్వీ ప్రసాద్.. 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సీఎస్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

