CM KCR | రైతుల గుండెల్లో స్వామినాథన్ చిరస్థాయిగా నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
CM KCR | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
CM KCR | హైదరాబాద్ : భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారు. స్వామినాథన్ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. రైతుల గుండెల్లో స్వామినాథన్ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ పేర్కొన్నారు.
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ శ్రీ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం శ్రీ కేసీఅర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు#MSSwaminathan pic.twitter.com/MO9DKrLcTo
— Telangana CMO (@TelanganaCMO) September 28, 2023
భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న రైతులకు .. దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన నేర్పారు.
1987లో స్వామినాథన్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. స్వామినాథన్ అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఆయన రామన్ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు ఆయన్ను వరించింది.
స్వామినాథన్‌కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్, మధురా స్వామినాథన్, నిత్యా స్వామినాథన్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్యా స్వామినాథన్.. చీఫ్ సైంటిస్టుగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
Doomsday | ఈ నెల 13న యుగాంతం.. ప్రపంచం అంతం కాబోతోందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల జోస్యం మళ్లీ వైరల్!
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

