గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 25, 2020 , 01:57:15

ప్రశాంతంగా రీపోలింగ్‌

ప్రశాంతంగా రీపోలింగ్‌


కామారెడ్డి/ మహబూబ్‌నగర్‌/ బోధన్‌, నమస్తే తెలంగాణ/ విద్యానగర్‌: కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లోని ఒక్కో కేంద్రంలో శుక్రవారం రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కామారెడ్డిలోని 41వ వార్డు 101 పోలింగ్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన పోలింగ్‌లో తనఓటును వేరొకరు వేశారని రాజ్‌బీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎస్‌ఈసీ శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించింది. ఇక్కడ 580 ఓట్లకు 396 (68.28) ఓట్లు పోలయ్యాయి. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ 41వ వార్డు 198వ పోలింగ్‌ కేంద్రంలో 718 ఓట్లకు 429 ఓట్లు పోలయినట్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని 32వ వార్డు 87వ పోలింగ్‌స్టేషన్‌లో 588 ఓట్లకు.. 433 మంది (73.63 శాతం) ఓటుహక్కును వినియోగించుకున్నారు. టెండ ర్‌ ఓటువేసి ఈ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌కు కారణమైన నసేహా సుల్తానా అనే మహిళా శుక్రవారం ఓటువేసేందుకు రాకపోవడం గమనార్హం.


logo