సజావుగా కానిస్టేబుల్ రాత పరీక్ష
- మొత్తం అభ్యర్థుల్లో 91.34% మంది హాజరు
- త్వరలో కీ విడుదల చేయనున్న టీఎస్ఎల్పీఆర్బీ
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష సజావుగా ముగిసింది. పోలీస్‌శాఖలో 15, 644, ఎక్సైజ్‌శాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు 1,601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న మొత్తం 6,61,196 మంది అభ్యర్థుల్లో 60,3955 మంది (91.34%) పరీక్షకు హాజరైనట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశామని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు, డిజిటల్ వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్స్ సేకరించినట్టు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలో www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఇటీవల ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షతో పోలిస్తే కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం చాలా సులభంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రీజనింగ్ (మెంటల్ ఎబిలిటీ) విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చినట్టు సమాచారం. జనరల్ స్టడీస్ విభాగంలో భారత, తెలంగాణ చరిత్ర నుంచి సుమారు 40 ప్రశ్నలు ఇచ్చారని, వీటిలో ఎక్కువ ప్రశ్నలు తెలంగాణ చరిత్ర నుంచే వచ్చాయని నిపుణులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

