Health Department | త్వరలో వైదారోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ..!
Health Department | తెలంగాణ ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Health Department | తెలంగాణ ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉంది. సమస్యను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా సర్జన్లను నియమించనున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. అలాగే, వివిధ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించే స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

