ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ శ నివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవికి క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుందని, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ శ నివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవికి క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుందని, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో 1955లో జన్మించిన చిన్నారెడ్డి 1977లో యువజన కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో ఏపీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు.
ఆ తరువాత పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వనపర్తి నుం చి 1989, 1999, 2004, 2014లో నాలుగు సా ర్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీ ఆయనకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిని కట్టబట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

