KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సారథి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలు శనివారం రాష్ట్రమంతటా వైభవంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరిగిన సంబరాలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సంబురాల ఏర్పాట్లను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ నిర్వహించారు. కేటీఆర్ తదితర నేతలు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాయికిరణ్ యాదవ్ సహకారంతో వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొకరికీ రూ.లక్ష కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్చైర్లను మాజీ మంత్రి కేటీఆర్ అందజేశారు. ప్రత్యేకంగా చేయించిన 70 కిలోల భారీ కేక్‌ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ కట్ చేశారు. కేసీఆర్‌పై రూపొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని వీక్షించారు.
కార్యకర్తల కుటుంబాలకు చెకుల పంపిణీ
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒకొకరికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా కింద మంజూరైన ఆర్థిక సహాయం చెకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అనిల్‌కుమార్ కూర్మాచలం, వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీశ్‌రెడ్డి, మసి ఉల్లా ఖాన్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఓయూ ప్రాంగణంలో..
కేసీఆర్ 70వ పుట్టినరోజును ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్వీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కేక్ కట్ చేసి, మొకలు నాటారు.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్ మాట్లాడు తూ.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించి.. 40 ఏండ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పా రు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్షనేతగా సభను సజావుగా నడపడానికి.. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధిపథంలో నడపడానికి దేవుడు కేసీఆర్‌కు శక్తినివ్వాలని, ఆ యురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం అకాంక్షించారు.
కువైట్‌లో మొక్కలునాటిన ఎన్నారైలు
కేసీఆర్ పుట్టినరోజును దేశవిదేశాల్లోని ఘ నంగా జరుపుకున్నారు. కువైట్‌లో ఎన్నారై కు వైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మొక్కలునాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆమె అకాంక్షించారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలను ముంబై, భివండీ పట్టణంలో వలసజీవులు ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ కళాకారిణి డా క్టర్ రాధామోహన్ కేక్ కట్ చేశారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో శనివారం రైతులు పొలాల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు సబ్బుబిల్లపై కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. దానిపై ‘రైతు బాంధవుడా’అని రాశారు. కేసీఆర్‌కు టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, దమ్మపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, బోనకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
హ్యాపీ బర్త్ డే డాడ్: కేటీఆర్
తన తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం గంటలోనే 6వేల లైకులతో ట్విటర్లో దూసుకెళ్తున్నది. ‘మై హీ రో.. లెజెండ్‌గా పిలువబడే కేసీఆర్.. నాన్నా 70వ జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా, గంటలోనే 77వేల వ్యూస్ వ చ్చాయి. వేలాదిమంది నెటిజన్లు రీట్వీట్లు, కా మెంట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి: గవర్నర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ప్రత్యేకంగా ఓ లేఖ ద్వారా విషెస్ పంపారు. కేసీఆర్ చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం వరించాలని గవర్నర్ ఆకాక్షించారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.
మొక్కలు నాటిన జే సంతోష్‌కుమార్
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ నేత సంతోష్‌కుమార్ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూడు హిమాయత్ పసంద్ మామిడి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరండి అని పిలుపునిస్తూ ట్విట్ చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సేవా థృక్పథాన్ని చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పెద్దపల్లి జిల్లా విలేజ్ అంతర్గాం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు కాంపెల్లి ఎల్లమ్మకు ఇంటిని నిర్మించారు. శనివారం ఆమెతో గృహప్రవేశం చేయించారు. కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.