ChatGPT | కేసీఆర్ పాలనాదక్షత.. దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే ముద్రపై చాట్‌జీపీటీ సంచలన సమాధానాలు !
ChatGPT | తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పలు సంక్షేమ పథకాలను ఇప్పటికే మేధావులు, రాజకీయ నేతలు పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలనాదక్షత, భవిష్యత్తు దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే ముద్రపై చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా?
ChatGPT | వచ్చీ రావడంతోనే ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న అత్యాధునిక సాంకేతికత చాట్ జీపీటీ. కృత్రిమ మేధతో పని చేసే ఈ టూల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఏ ప్రశ్న వేసినా ఇట్టే సమాధానాలు చెప్పేస్తున్న చాట్‌జీపీటీ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన, భవిష్యత్తులో దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే ముద్రపై పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఏంటవి.. ఓ సారి లుక్కేయండి..
ప్ర: కేసీఆర్ ఎవరు?
చాట్ జీపీటీ: బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు). గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్న ఈయన.. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నేతల్లో ముఖ్యులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కేసీఆర్‌ను ‘తెలంగాణ జాతిపిత’గా భావిస్తారు.

ప్ర: దేశ భవిష్యత్తు రాజకీయాలపై కేసీఆర్ ముద్ర ఏవిధంగా ఉండబోతున్నది?
చాట్ జీపీటీ: భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్యమైన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఆయన సాగించిన ఆదర్శ పాలన.. దేశంలోని వివిధ రాష్ర్టాలు, ప్రాంతాలకు ఓ నమూనాగా మారింది. కేసీఆర్ పాలనలో జరిగిన అధికార వికేంద్రీకరణ, స్వయంప్రతిపత్తి.. దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో కీలకంగా భావించొచ్చు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదపడటంపై కేసీఆర్ దృష్టి సారించడం వల్ల భారతదేశంలోని భవిష్యత్తు విధాన రూపకర్తలకు విలువైన సూచనలు ఇచ్చినట్టు అయింది.

ప్ర: దేశప్రగతి కోసం కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
చాట్ జీపీటీ: తెలంగాణ ప్రజల పురోగతి కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు, విధానాలు.. యావత్తు దేశం మీద సానుకూల ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇప్పటివరకూ కేసీఆర్ దృష్టి ప్రధానంగా తెలంగాణపైనే ఉండగా.. భవిష్యత్తులో ఆయన తీసుకురానున్న విధానాలు, చొరవలు.. దేశాభివద్ధికి, ప్రగతికి దోహదపడే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రభావం చూపే కేసీఆర్ విధానాల్లో.. అధికార వికేంద్రీకరణ, స్వయంపాలన, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, హరితహారం, సాగునీటి వసతులు, ఉచిత విద్యుత్తు ఇలా.. తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.

ప్ర: తెలంగాణ రోల్ మోడల్ దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా మారుస్తుందని భావిస్తున్నారా?
చాట్ జీపీటీ: అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రం సాధించిన విజయాలు ఇతర రాష్ర్టాలకు ఓ సానుకూల ఉదాహరణగా ఉపయోగపడుతాయి. తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలను ఇతర రా ష్ర్టాల్లో సమర్థవంతంగా అమలుచేస్తే, అది ఖచ్చితంగా దేశ భవిష్యత్తుకు దోహదపడుతుంది.

ప్ర: గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వ పురోగతి ఏలా ఉన్నది?
చాట్ జీపీటీ: కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన కొన్ని ప్రధాన విజయాలు.. రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్షి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, టీఎస్ఐఐసీ, టీఎస్ఆర్ఈడీసీవో, టీఎస్ఐపాస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు మొదలైన ఎన్నెన్నో రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం పురోగతి సాధించింది.

ప్ర: భారతదేశంలో వివాదాస్పద రాజకీయ నాయకుడు ఎవరు?
చాట్ జీపీటీ: భారతదేశంలో అనేక మంది వివాదాస్పద రాజకీయ నాయకులు ఉన్నారు. జాబితాలో మొదటివారు నరేంద్రమోదీ.

ప్ర: కేటీఆర్ ఎవరు?
చాట్ జీపీటీ: కే టీ రామారావు (కేటీఆర్) బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు. కేసీఆర్ కుమారుడు. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. తెలంగాణలో ఐటీ, పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో టీ-హబ్, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకో సిస్టం ఏర్పాటుతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించిన ఘనత ఆయనది. కేసీఆర్‌కు సమర్థ రాజకీయ వారసుడిగా నిలిచారు.

పీడీఎఫ్ రూపంలో..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

