KTR: సిగ్గుచేటు.. చార్మినార్ గుర్తును తొలగిస్తారా: కేటీఆర్
KTR: చార్మినార్ గుర్తును స్టేట్ లోగో నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి చార్మినార్ మణిహారం అని, శతాబ్ధాల చరిత్రకు ఆ కట్టడం సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ అంటేనే చార్మినార్. కొన్ని శతాబ్ధాలుగా ఈ నగరానికి అదో ఐకాన్ సింబల్. ప్రపచంవ్యాప్తంగా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది చార్మినార్తోనే. మరి అలాంటి అద్భుత కట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రాజముద్రలో ఓ చిహ్నంగా పెట్టుకున్నది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించే ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన ఎక్స్ అకౌంట్ వేదికగా స్పందించారు. ఎవరైనా హైదరాబాద్ గురించి ఆలోచిస్తే, వాళ్లు చార్మినార్ కట్టడం గురించి ఆలోచించకుండా ఉండలేరని, ఆ మహాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ గుర్తును.. రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అనుచిత కారణాలు చూపుతూ.. లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuries
When one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site
Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL
— KTR (@KTRBRS) May 30, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

