గోపాల్పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని దర్గాలో మంగళవారం ఓ డమ్మీ రివాల్వర్ కలకలం రేపింది. బుద్ధారం నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉన్న దర్గాలో గుర్తుతెలియని వ్యక్తి డమ్మీ రివాల్వర్‌ను వదిలి వెళ్లాడు.
గ్రామస్థుల సమాచారంతో సీఐ ప్రవీణ్, ఎస్సై నవీద్, స్పెషల్ బ్రాంచ్ (క్లూస్ టీం) సీఐ శ్రీనివాస్ ఆచారి అక్కడికి చేరుకొన్నారు. రివాల్వర్‌ను పరిశీలించి సినిమాల్లో వాడే డమ్మీ రివాల్వర్‌గా నిర్ధారించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు.