Engineering | ఇంజినీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు..!
Engineering | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ సీట్ల భర్తీకి కోసం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలు కావాల్సిన కౌన్సెలింగ్ వాయిదాపడింది.
Engineering | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ సీట్ల భర్తీకి కోసం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలు కావాల్సిన కౌన్సెలింగ్ వాయిదాపడింది. మళ్లీ జూలై 4 నుంచి ఇంజినీరింగ్ తొలివిడత ప్రక్రియ మొదలవనున్నది. జూలై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్, 8వ తేదీ నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్స్, 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక జూలై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని.. 27న రెండో విడత కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇస్తామని.. 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్ట్ 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్ట్ 9న మూడో విడత కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి.. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే నెల 13న ఇంజినీరింగ్ మూడో విడత సీట్ల కేటాయించనున్నారు. ఇక ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ ఉండనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

