హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలం గాణ): హార్టికల్చర్ ఆఫీసర్ దరఖాస్తుల్లో తప్పు ల సవరణకు ఈ నెల 8 నుంచి 10 వరకు అవకాశం కల్పించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గత జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించా మని, ఏప్రిల్ 4న రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వివరాలకు https://www. tspsc.gov.inలో సంప్రదించాలని సూచిం చారు. రాష్ట్రంలోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 22 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 22న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.