హైదరాబాద్ : సినీ నటులు చలపతిరావు మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.చలపతిరావు అకాల మృతి వార్త తెలుసుకొని జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావు కుటుంబ సభ్యులను మంత్రి తలసాని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.మూడు తరాల నటులతో నటించిన గొప్ప నటుడు చలపతిరావని అన్నారు.
విభిన్న పాత్రలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించి రెండు రోజులు గడవకుండానే మరో నటుడు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని వెల్లడించారు. మంత్రి తలసాని వెంట జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులున్నారు.