జల వివాదాలపై కేంద్రం ఏకపక్షమే.. ఏపీకి అడుగడుగునా సహకారం
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దన్నుతోనే ఏపీ సర్కార్ గోదావరి-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్నది. అవార్డులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టేందుకు సిద్ధమైంది. అందుకు కేంద్ర సర్కార్ విధానాలూ దోహదం చేస్తున్నాయి.
- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల అభిప్రాయాలూ బుట్టదాఖలు
- పొరుగు రాష్ర్టాలు నోరెత్తకుండా వరాలు
- మరోవైపు 12 ఏండ్లుగా తెలంగాణపై వివక్ష
- నిధులివ్వకపోగా రాష్ట్ర ప్రాజెక్టులకూ కొర్రీలు
- ఏపీ కోసం నేడు స్వయంగా మంతనాలు
- ఆగమేఘాల మీద కమిటీలు.. గుట్టుగా చర్చలు
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కార్ దన్నుతోనే ఏపీ సర్కార్ గోదావరి-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్నది. అవార్డులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టేందుకు సిద్ధమైంది. అందుకు కేంద్ర సర్కార్ విధానాలూ దోహదం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడంతోపాటు ఆర్థిక సాయం అడిగిందే తడవుగా కేంద్రం స్పందించింది. ప్రాజెక్టుపై అధ్యయనానికి వెంటనే పూనుకున్న ది. ఏపీ సీఎం లేఖను సీడబ్ల్యూసీకి పంపింది. దీనికి సీడబ్ల్యూసీ సైతం వెంటనే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాసింది. ఏపీ ప్రతిపాదించిన జీబీ లింక్ ప్రాజెక్టుపై తదుపరి చర్య లు చేపట్టేందుకు సమగ్ర వివరాలు, అభిప్రాయాలు తెలియజేయాలని హుకుం జారీ చేసిం ది. ఆయా సంస్థలు ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధమని, గోదావరిలో మిగులు జలాలే లేవ ని పేర్కొన్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు ఇ చ్చేందుకు సైతం నిరాకరించింది. అయినా, కేంద్రం వాటని బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుపై పొరుగురాష్ర్టాలు అభ్యంతరాలు చెప్పకుండా తాయిలాలు ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతితోపాటు బెడిది వ రద ప్రాజెక్టు కోసం కర్ణాటకకు, వైతరణి-దమనగంగ-గోదావరి లింక్ కోసం మహారాష్ట్రకు హామీనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి సుబోధ్ఘాట్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ సర్కార్‌తో చర్చలకు తెరతీసింది. ఎన్నడూలేని విధంగా జలవివాదాల పరిష్కారం కోసమంటూ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. గుట్టుగా మంతనాలు సాగిస్తున్నది. పాలమూరుకు అనుమతిస్తే నల్లమలసాగర్‌కు తెలంగాణను ఒప్పిస్తామంటూ ప్రతిపాదనలు ముందు కు తెచ్చింది. అంటే కేంద్రం.. ఏపీ కోసం ఎంతగా కృషిచేస్తున్నదో అర్థమవుతున్న ది.
రాష్ట్రం వినతులు బుట్టదాఖలు.. పైగా కొర్రీలు
- 12 ఏండ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నది. నీటి వాటాలు తేల్చాలని, అందుకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏ ర్పాటు చేయాలని 2014లోనే అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. కానీ, 2023 సెప్టెంబర్ వరకు ట్రిబ్యునల్ వేయకుండా తాత్సారం చేసింది. ఎన్నికల ముందు మార్గదర్శకాలు జారీ చేసింది.
- పోలవరంతో తెలంగాణలో ఏర్పడే ముంపుపై సర్వే చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఏర్పాటునుంచీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కోర్టు కూడా సర్వే చేయాలని ఆదేశించింది. కేంద్ర సంస్థల నిర్లక్ష్యంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేంద్రం ఇప్పటికీ ఆ సర్వే చేపట్టడం లేదు.
- సుదీర్ఘకాలంపాటు వివక్ష ఎదుర్కొని, వలసల పాలైన మహబూబ్‌నగర్ ఉమ్మడి జి ల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినా రూపాయి విదల్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా మంజూరు చే యలేదు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం అప్రయిజల్ లిస్టు నుంచి తొలగించింది. ట్రిబ్యునల్ వివాదం సాకుతో 45 టీఎంసీలకే ప్రతిపాదనలు పంపాలని కో రింది. మరోవైపు సమ్మక్కసాగర్‌కు అనుమతుల మంజూరుకు కొర్రీలు పెట్టింది.
- కృష్ణా జలాల వినియోగానికి గతంలో తాత్కాలిక ఒప్పందానికి ఒప్పుకోబోమని, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా 50ః50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని 2018 నుంచే తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేస్తున్నది. బోర్డు సమావేశాల్లో ప్రతిపాదనలు పెడుతున్నది. 2022 లో 16వ బోర్డు సమావేశంలోనే ఇక తాత్కాలిక వాటాకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. నీటి వినియోగ లెక్కలపై అధ్యయనం కోసం టెలిమెట్రీల ఏర్పాటు పై పట్టుబట్టింది. జల్‌శక్తి మంత్రి, ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్‌కు రెఫర్ చేయాలని నిర్ణయించింది. కానీ, 2020 తర్వాత ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేయలేదు.
నోరు తెరువని కాంగ్రెస్-బీజేపీ బరిగీసి కొట్లాడుతున్న బీఆర్ఎస్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీకి అడుగడుగునా వంతపాడుతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసిన పరిస్థితి లేదు. లేఖలకే పరిమితమైంది తప్ప కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. కేంద్ర చర్యలన్నింటికీ కాంగ్రెస్ సర్కార్ వంతపాడుతున్నది. పాలమూరు డీపీఆర్ వెనక్కి వచ్చినా నోరుమెదకపోవడం, 45 టీఎంసీలకు నీటి కోటా కుదించడం, బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు మొగ్గుచూపడమేకాదు, ఏపీతో, కేంద్రంతో చర్చలకు పరుగులు పెట్టడమే ఇందుకు అద్దం పడుతున్నది. కేంద్ర సంస్థలు, ఏపీ కుట్రలపై తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు నోరుమెదపడం లేదు. ఇక బనకచర్లనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదటినుంచీ బీఆర్ఎస్ బరిగీసి కొట్లాడుతున్నది. కేసీఆర్ పట్టువదలని పోరాటం ఫలితంగా ట్రిబ్యునల్ కల సాకారమైంది. తాజాగా బనకచర్ల ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న గులాబీశ్రేణులే. హక్కుల కోసం కాంగ్రెస్, బీజేపీ సర్కార్లను నిలదీస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

