రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ..
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం చేసుకున్నది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం చేసుకున్నది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సోమవారం ఒప్పందం జరిగింది. హెల్త్‌కేర్, లైఫ్ సెన్సెస్ రంగాల్లో సీ4ఐఆర్ సంస్థ సేవలు అందించనున్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లో ఈ సంస్థ సేవలు అందిస్తున్నది. భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటుకానున్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్‌తో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
హెల్త్‌కేర్, లైఫ్ సెన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంచుకున్నందుకు సంతోషం ఉందన్నారు. హైదరాబాద్‌లో సీ4ఐఆర్ సంస్థ ఏర్పాటుతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్స్ ప్రాధాన్యత రంగాల్లో ఒకటని, హైదరాబాద్‌లో C4IR సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సృష్టించిన విలువ. ప్రభావాన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రస్తుత పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కేటీఆర్ అన్నారు. సీ4ఐఆర్ సంస్థ ఏర్పాటుతో ప్రభుత్వ రంగం, ఎస్ఎంఈల మధ్య వంతెనలను నిర్మించడంలో.. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధిని సృష్టించడంలో కీలక పాత్ర పోసిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Egg Donation Scam | ఆరు రాష్ట్రాల యువతులు.. కోట్లలో దందా! అండాల రాకెట్ వెనుక ఉన్న ‘రాజకీయ పెద్దలు’ ఎవరు?
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
Death Certificates Scam | బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. సిద్దిపేటలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ మోసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

