మెడికల్ కాలేజీల అభివృద్ధికి 379 కోట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పెరిగిన ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా ఆయా కాలేజీలు, అనుబంధ దవాఖానలను అభివృద్ధి చేసేందుకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్) కింద రూ.379 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
- సీఎస్ఎస్ స్కీమ్ కింద కేంద్రం అనుమతులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పెరిగిన ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా ఆయా కాలేజీలు, అనుబంధ దవాఖానలను అభివృద్ధి చేసేందుకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్) కింద రూ.379 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అనుమతులు తెలుపుతూ కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.
గత రెండేండ్లలో రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 465 పీజీ సీట్లు పెరుగగా.. సీఎస్ఎస్ స్కీమ్ కింద ఒక్కో పీజీ సీటుకు సగటున రూ.81.57లక్షల చొప్పున, మొత్తం రూ.379.29 కోట్లను కేంద్రం ఇవ్వనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.253 కోట్లను కలిపి మొత్తం రూ.632 కోట్లతో కాలేజీలు, దవాఖానలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఏడాది ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెరిగిన నేప థ్యంలో ఈ కాలేజీలు, వాటి అనుబంధ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రూ.108 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుండగా.. ఇందులో రూ.64 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

