విభజన సమస్యలపై 23న కేంద్ర హోంశాఖ సమావేశం
Home Ministry | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం పంపిన హోంశాఖ.. భేటీకి తప్పనిసరిగా రావాలని
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం పంపిన హోంశాఖ.. భేటీకి తప్పనిసరిగా రావాలని కోరింది. భేటీలో విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు సెప్టెంబర్ 27న భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై కేంద్రం చర్చించింది. ఏపీకి సంబంధించి ఏడు అంశాలపై కేంద్ర అధికారులు చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
ఆ నిబంధనకు అనుగుణంగా రెండేళ్లలో చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి కానున్నది. గత ఎనిమిదేళ్లు పలు సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలపై ఏ కొలిక్కి రాలేదు. అలాగే ఈ సారి ఏపీ రాజధాని అంశాన్ని సైతం సమావేశం ఎజెండాలో ప్రస్తావించారు. అమరావతికి రైల్వే కనెక్టివికి సంబంధించిన అంశాలను ఎజెండాలో కేంద్రం చేర్చింది. గత సమావేశంలో జరిగిన 14 అంశాలతోనే మరోసారి భేటీ జరుగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

