కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చాలి : రజత్ కుమార్
రజత్ కుమార్ | కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే వరకు 811 టీఎంసీల్లో సగం ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కేంద్రానికి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేవాదుల, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని రజత్ కుమార్ గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం ఇంజినీర్లు, న్యాయవాదులతో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

